- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Ponguleti Srinivas Reddy : అర్హులైన పేదలకు పట్టాలు ఇస్తాం : మంత్రి పొంగులేటి
అర్హులైన పేదలకు అసైన్‌మెంట్ భూములకు పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : అర్హులైన పేదలకు అసైన్‌మెంట్ భూములకు పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం(Bhu Bharati Act) ద్వారా రైతుల భూ సమస్యలను, ముఖ్యంగా సాదా బైనామా, అసైన్‌మెంట్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగించిందని తెలియజేశారు. ధరణితో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటిని సాల్వ్ చేయడానికి ఎంతో కృషి చేసి భూ భారతిని తీసుకు వచ్చామని.. దీని ద్వారా ఎక్కడి నుంచైనా వారి భూముల సమస్యలను పరిష్కరించుకునే వీలుందని అన్నారు.
రెవెన్యూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రైతుల అన్ని రకాల భూ సమస్యలను జూన్ 2 నుంచి 20 వరకు భూ భారతి సహాయంతో పరిష్కరిస్తారని వెల్లడించారు. పారదర్శకంగా భూ భారతి చట్టం అమలు చేస్తామణి హామీ ఇస్తున్నానని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Indla Scheme) కింద 1.95 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి, మే చివరి నాటికి 2.55 లక్షల మందిని ఫైనల్ చేస్తామని తెలియజేశారు. ఈ పథకంలో రూ.5 లక్షల నిధులు నాలుగు దశల్లో పారదర్శకంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ చర్యలు రైతులు, నిరుపేదల సాధికారతకు, సమాజంలో సమానత్వం సాధించడానికి దోహదపడతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.






