- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల కోసం వెయ్యి కోట్లు విడుదల చేశాం: మంత్రి పొంగులేటి
బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మొదటి విడతలో రూ.1000 కోట్లు విడుదల చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మొదటి విడతలో రూ.1000 కోట్లు విడుదల చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం భద్రాచలానికి ఒక్క పైసా ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించడమే కాకుండా.. రూ.300 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. కూసుమంచిలోని చారిత్రాత్మక శివాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. అన్ని మతాలను సమానంగా చూస్తూ మతాలకు అతీతంగా ఆలయాలు, చర్చిలు, మసీదులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే, కొన్ని పార్టీలు మాత్రం దేవుడి గుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిధులు కేటాయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.






