- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్ట్ రెడీ.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10 లక్షల లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10 లక్షల లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 10లోగా అర్హులైన మిగతా లబ్ధిదారుల లిస్టు కూడా రెడీ అవుతుందని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 42 వేల ఇళ్లను మంజూరు చేయగా.. 24 వేల ఇళ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. సుమారుగా 100 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమయ్యాయని, మిగతా ఇళ్లను కూడా అతిత్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) టెండర్లలో గోల్‌మాల్ జరిగింది. వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఏడాది మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ), ఇన్‌స్టాంట్ రిపేర్ టీమ్స్ (ఐఆర్‌టీ)ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోంది. వీటికి సంబంధించి అద్దె ప్రతిపాదికన వాహనాలు సమకూర్చే టెండర్లను బల్దియాలోని రవాణా విభాగం ప్రకటిస్తూ వస్తోంది. ఈసారి కూడా టెండర్లు పిలిచి అలాట్ చేశారు. మరి ఈ టెండర్లలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీకి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వ్యవసాయాదారిత దేశమైన ఇండియా టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతోందని చెప్పారు. కొనుగోలు శక్తిలో జపాన్‌ను దాటేశామని వెల్లడించారు. వాట్సాప్ ద్వారా పంటను కొనుగోలు చేస్తున్నామని, ఈ టెక్నాలజీని 18 వేల మంది రైతులు వాడుకున్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మంత్రి ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవార్డు రావడం దైవ నిర్ణయంగా, తన తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదంగా ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. అదేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






