- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: రాష్ట్రంలోని నిరుపేదలకు తీపి కబురు.. ఇందిరమ్మ ఇండ్లపై పొంగులేటి సంచలన ప్రకటన
ఇందిరమ్మ ఇండ్లపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని వచ్చే మార్చి-ఏప్రిల్‍లో రాష్ట్రంలో మరోవిడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడే హామీలు అమలు కాకుండా మరో ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మాట్లాడిన మంత్రి పొంగులేటి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇండ్లు ఇచ్చేవారని కానీ మేము రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇస్తున్నామని కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాల మర్రిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మేం కట్టించామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించే రూ.5 లక్షల్లో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు ఇస్తున్నామన్నారు.
వచ్చే కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం:
సింగరేణి ప్రాంతాల్లో 76 జీవో ప్రకారం పట్టాల పంపిణీ పెండింగ్‍లో ఉందని దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి పట్టాలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించి మొండి గోడలతో వివిద దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల ఇండ్లు ఉన్నాయని వీటి విషయంలో కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని పెద్ద పట్టణ ప్రాంతంలో స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, హౌసింగ్ సెక్రటరీతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో గతం నుంచి నివసించే స్థలాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో ఇబ్బందులు ఉన్నాయనేది వాస్తవం అని ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
గతంలో కమిషన్ల కోసమే
బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసిందని ఆరోపించారు. మేము గిరిజన ప్రాంతాల్లో 12, 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చా మన్నారు. భేషజాలకు పోకుండా అందరికీ నిధులు ఇస్తున్నామన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూంలు పూర్తి చేస్తున్నామని మేం వచ్చేనాటికి 133 కాలనీల్లో 36 వేల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని వీటి కోసం రూ.744 కోట్లు కేటాయించామని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు.






