Ponguleti: దశాబ్దాల నాటి సమస్యకు చెక్.. మున్సిపాలిటీలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

by Prasad Jukanti |

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Ponguleti: దశాబ్దాల నాటి సమస్యకు చెక్.. మున్సిపాలిటీలకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses Scheme) విషయంలో వెనక్కి తగ్గబోయేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చెప్పారు. ఇప్పటికే మొదటి విడత మంజూరూ చేశామని వచ్చే ఏప్రిల్‍లో రెండవ విడత మంజూరు చేస్తామన్నారు. ఇవి కాకుండా మరో మూడు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‍లో ఆదివారం'ప్రజాపాలన-ప్రగతి బాట' సభలో ఆయన పాల్గొని మాట్లారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం ప్రణాళికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తనకు సూచన చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లోని కొన్ని సర్వే నంబర్ల సమస్యలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయని వందలాది ఎకరాల భూములకు సంబంధించి సరైన సర్వే నంబర్లు, భూపత్రాలు లేక భూ యజమానులు వాటిని విక్రయించే విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలకు ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించబోతోందని ప్రకటించారు. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టే మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఇచ్చారని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మీ దీవెనలు మా ప్రభుత్వంపై ఉండాలని కోరారు.

Next Story