Ponguleti Srinivas Reddy : డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

by Muthe.Rajitha |

పెద్దపల్లి(Peddapalli) జిల్లా కేంద్రంలో నేడు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిMinister Ponguleti Srinivas Reddy) డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు.

Ponguleti Srinivas Reddy : డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్ : పెద్దపల్లి(Peddapalli) జిల్లా కేంద్రంలో నేడు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిMinister Ponguleti Srinivas Reddy) డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేడు పెద్దపల్లిలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం వారికి ఇళ్ల ధ్రువపత్రాలను అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నాలుగు విడతల్లో అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామని పునరుద్ఘాటించారు.

రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పెద్దపల్లిలో ఈ రోజు ప్రారంభించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఈ పథకంలో భాగమేనని, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story