- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధనిక తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల తెలంగాణగా మార్చింది : మంత్రి పొంగులేటి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధనిక తెలంగాణను కాస్తా అప్పుల తెలంగాణగా మార్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ

దిశ, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధనిక తెలంగాణను కాస్తా అప్పుల తెలంగాణగా మార్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పేదవాడి చిరకాల కోరిక సొంతిల్లు అని పదేళ్లు పాలించి పేదలకు సొంత ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పారు.
కాళేశ్వరం కడితే కమీషన్ వస్తుందనే పేదవాడికి ఇల్లు కట్టించలేదని మండిపడ్డారు. పేదల కోసం రేవంత్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. ఉచిత కరెంట్ అందిస్తున్నామని, సన్నబియ్యం అందజేస్తున్నామని, ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు. విద్య, వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.






