- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti: శివరాజ్ సింగ్ చౌహాన్‍కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
పేదలకు ఇండ్ల నిర్మాణం విషయంలో కేంద్రం సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‍కు పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లను మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్‍చౌహాన్‍ను(Shivraj Singh Chouhan) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి (Ponguleti Srinivas Reddy) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాల హైదరాబాద్‍కు విచ్చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‍ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలల్లో కేంద్రం నుండి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. కానీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలకు ఇండ్లు మంజూరు చేయాలని గడిచిన రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉందని పేర్కొన్నారు.
మరో 2 లక్షల ఇండ్లను మంజూరు చేయండి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత పీఎంఏవై-జిలో రాష్ట్రం అధికారికంగా చేరిందని రాష్ట్రంలో గత 12 ఏళ్లలో పెరిగిన డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్‌ను ఇప్పటికే సిద్ధం చేసిందని తెలియజేశారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందన్నారు.






