- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti Srinivasa Reddy : ప్రతి జిల్లాకు కోటి రూపాయలు రిలీజ్
వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్ని జిల్లా కలెక్టర్లను (Collectors) ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఇవాళ సెక్రటేరియట్ (Secretariat) నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్ కె.రామకృష్ణరావుతో పాటు జిల్లా కలెక్టర్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశించారు. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలో మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో పని చేయాలని, జీహెచ్ఎంసీలో మెట్రో వాటర్ బోర్డు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అధికారుల సెలవులు రద్దు చేసి అందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.






