Minister BC Janardhan Reddy : రెవెన్యూ సదస్సులో వీఆర్వో సస్పెన్షన్ కు మంత్రి ఆదేశాలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-06 09:17:22  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల్లో ప్రస్తుతం రెవిన్యూ సదస్సు(Revenue conference)లు వాడివేడిగా సాగుతున్నాయి. కర్నూల్ జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి రెవెన్యూ సదస్సులో స్థానిక వీఆర్వో(VRO) గంగన్నను సస్పెండ్ (Suspension)చేయాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(Minister BC Janardhan Reddy) జాయింట్ కలెక్టర్ కు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది.

Minister BC Janardhan Reddy : రెవెన్యూ సదస్సులో వీఆర్వో సస్పెన్షన్ కు మంత్రి ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల్లో ప్రస్తుతం రెవిన్యూ సదస్సు(Revenue conference)లు వాడివేడిగా సాగుతున్నాయి. కర్నూల్ జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి రెవెన్యూ సదస్సులో స్థానిక వీఆర్వో(VRO) గంగన్నను సస్పెండ్ (Suspension)చేయాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(Minister BC Janardhan Reddy) జాయింట్ కలెక్టర్ కు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. సీఎం సహాయనిధి చెక్ ఇచ్చేందుకు వీఆర్వో గంగన్న రూ.2వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితురాలు మంత్రికి ఫిర్యాదు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి రైతులను, మహిళలను కూడా లంచం డిమాండ్ చేయడం దారుణమని, వెంటనే వీఆర్వోను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసి దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీ భూమి-మీ హక్కు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 17,564 రెవెన్యూ గ్రామాల్లో (Revenue Villages) 33 రోజులపాటు సదస్సుల నిర్వహణ ఉంటుంది. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అలా స్వీకరించిన ఆర్జీలపై సదస్సులో చర్చించి వీలైనంతవరకు అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపుతారు. తీసుకున్న ప్రతి పిటిషన్‌కు రసీదు ఇస్తారు. సదస్సుకు ముందే గ్రామంలో అధికారులు పర్యటిస్తారు. సదస్సుల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక్కొక్క ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బాపట్ల జిల్లా రేపల్లెలో సదస్సులను ప్రారంభించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన టైటిల్‌ యాక్ట్‌ను అధికారంలోనికి రాగానే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.

Next Story