కన్నీరు పెట్టిస్తోన్న ఇద్దరు విద్యార్థినుల మృతి.. స్పందించిన మంత్రి దామోదర

by Gantepaka Srikanth |

గద్వాల రోడ్డు ప్రమాద(Road Accident) ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) స్పందించారు. ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతిచెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కన్నీరు పెట్టిస్తోన్న ఇద్దరు విద్యార్థినుల మృతి.. స్పందించిన మంత్రి దామోదర
X

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల రోడ్డు ప్రమాద(Road Accident) ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) స్పందించారు. ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతిచెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. గాయాలపాలైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతిచెందిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు. ఎంతో జీవితం ఉన్న విద్యార్థినుల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఓ బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలుచున్న విద్యార్థినులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్వరీ(20), మనీషాశ్రీ (21) అనే ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రికి కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగులయ్య చేరుకొని గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవల కోసం సంబంధిత వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Next Story