- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో సీఐఐ సమ్మిట్.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యం: మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి తాము పోటీపడి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం ఉండవల్లిలో నిర్వహించిన మీడియాలో సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ.. గత 16 నెలల్లో ఏపీలో సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు (Investments) పెట్టడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. వైజాగ్‌లో త్వరలో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుందని అన్నారు. సీఐఐ సదస్సుల్లో 48 సెషన్స్ జరుగుతాయని, అందులో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, అదేవిధంగా 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.






