- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో భారీ వర్షం.. ట్రాఫిక్ దెబ్బకు మెట్రో బాట పట్టిన మంత్రి, ఎమ్మెల్సీ
గత వరం రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతుండగా.. నగర రోడ్లు ఎక్కడికక్కడ చెరువులు, నదులను తలపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : గత వరం రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతుండగా.. నగర రోడ్లు ఎక్కడికక్కడ చెరువులు, నదులను తలపిస్తున్నాయి. దీంతో కీలక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ కుండపోత వర్షంలో ఏర్పడే ట్రాఫిక్ దెబ్బకు మంత్రులు కాన్వాయ్ వదిలి మెట్రో బాట పట్టారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూకట్ పల్లిలో ఓ వివాహానికి హాజరు కావాల్సి ఉండగా.. ఎల్బీనగర్ నుంచి KPHB వరకు తమ కాన్వాయ్ వదిలేసి మెట్రోరైల్లో ప్రయాణించారు.
ఎలాంటి ట్రాఫిక్ జాం గోల లేకుండా వివాహ సమయానికి చేరుకోవడానికి ఈ మార్గమే ఉత్తమం అని తెలిపారు. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో మంత్రి, ఎమ్మెల్సీ సరదాగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసారు.






