- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ దాని గురించి మాట్లాడటం విని కోటి మంది చనిపోయారు: మంత్రి కేటీఆర్
కేంద్రంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమపార్టీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా చెబుతున్నప్పటికీ ఈసీ, ఈడీ, ఐటీ ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలపై వరుసదాడులు నిర్వహిస్తున్న ఈ సంస్థలు.. బహిరంగంగా చెబుతున్న ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీపై ఆరోపణలు చేసిన వారిపై ఏమైనా నోటీసులు జారీ చేస్తారా లేదా విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. అవినీతి గురించి మోదీ మాట్లాడిన మాటలు విని కోటి మంది చనిపోయారని ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు న్యాయం.. కేంద్రంలో ఉన్న అధికారపక్ష నేతలకు ఒక న్యాయమా అని పేర్కొన్నారు.
Next Story






