ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాయి: మంత్రి కొప్పుల ఈశ్వర్

by Sathputhe Rajesh |

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకిచ్చిన మాట, హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం

ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాయి: మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకిచ్చిన మాట, హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 11వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ,80వేల 39 ఉద్యోగుల భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విధాన ప్రకటన చేయడం హర్షణీయమన్నారు. ఉద్యమ కాలంలో ప్రజలకు మాట ఇచ్చిన విధంగా విద్యుత్,నీటి సమస్యలను కేసీఆఆర్ శాశ్వతంగా పరిష్కరించారన్నారు.

నిధుల విషయానికొస్తే.. కేంద్ర ప్రభుత్వం నుంచి చేయూత లేనప్పటికీ రాష్ట్రాన్ని గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారన్నారు. ఉద్యోగాలలో 95% స్థానికులకే దక్కే విధంగా జోనల్ విధానానికి రూపకల్పన చేసి,ఖాళీల భర్తీకి ఆదేశాలివ్వడం సంతోషదాయకమన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో గొప్పగా స్థిరపడాల్సిందిగా విద్యార్థులు, యువతను మనసారా కోరుతూ ఆశీస్సులు అందిస్తున్నానని చెప్పారు.

Next Story