అది స్కామ్ కాదు.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు: కొప్పుల

by Disha Web |
అది స్కామ్ కాదు.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు: కొప్పుల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ లబ్దికోసమే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీక్‌పై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చినా కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేస్తుందని, నిందితులు ఎవరున్న కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు తప్ప ఇది స్కామ్ కాదని స్పష్టం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వెల్లడించారు. కేటీఆర్ ఆదరణను తగ్గించడానికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.Next Story