- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందశాతం కట్టుబడి ఉన్నాం.. తెలంగాణ మహిళలకు మంత్రి భరోసా
తెలంగాణలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం(Congress Govt) మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం(Congress Govt) మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాదులో ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఆంట్రప్రెన్యూర్ అండ్ బీ2బీ ఎక్స్‌పో - 2025లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మట్లాడుతూ.. చారిత్రక నాయకురాలు రాణి రుద్రమ దేవి నుంచి మొదలుకొని నేటి వ్యాపారవేత్తల వరకు మహిళలు సమాజానికి వెన్నెముకగా ఉన్నారని పేర్కొన్నారు. వారి సాధికారత సామాజిక పురోగతి మాత్రమే కాదన్నారు. ఆర్థిక వృద్ధికి కీలకమని వివరించారు. మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యను ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో లక్ష మంది మహిళా కోటీశ్వరులను తయారు చేయడానికి ప్రభుత్వ చేయూతనిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, నైపుణ్యాభివృద్ధి అందజేస్తున్నట్టు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రం ఆధ్వర్యంలో మహిళా ఆంట్రప్రెన్యూర్‌ల కోసం తొలి ఇన్‌క్యూబేటర్ వీహబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. టీ-ఐడీఈఏ, మహిళల నేతృత్వంలోని వ్యాపారాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్టు తెలిపారు.
పాడి, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాలకు మద్దతిస్తున్నట్టు చెప్పారు. ఐటీ, సౌరశక్తి, లాజిస్టిక్స్ వంటి రంగాలలో మహిళలను ప్రోత్సహించడం చేస్తున్నట్టు వివరించారు. "దేశ వ్యాప్తంగా మహిళా ఆంట్రప్రెన్యూర్‌లకు సీఓడబ్ల్యూఈ (COWE) మార్గదర్శకత్వం, ఇంకా మద్దతు అందిస్తుండడం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను బలపరిచేందుకు, ఇంకా వారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి నాయకత్వం వహించేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది" అని మంత్రి కొండా సురేఖ తెలిపారు.






