- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రిగా ఉన్న సమయంలో పుష్కరాలు రావడం నా అదృష్టం: కొండా సురేఖ ఎమోషనల్
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల(Telangana Pushkaralu)పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల(Telangana Pushkaralu)పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇతర మంత్రులతో కలిసి పుష్కరస్నానం చేశారు. అంనతరం మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నపుడు పుష్కరాలు రావడం చాలా సంతోషంగా ఉందని హ్యాపీగా ఫీలయ్యారు. ఇది సరస్వతి తల్లి అనుగ్రహం అని చెప్పారు. భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని చాలా పక్కగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. భక్తులకు సరస్వతీ దేవి మంచి చేయాలని.. రాష్ట్రంలోని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కరుణ చూపాలని కోరారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా వస్తారని.. అందుకే పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సరస్వతీ కటాక్షం తెలంగాణ విద్యార్థులందరి మీద ఉండాలని ఆ సరస్వతి వేడుకున్నట్లు చెప్పారు.






