- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ సైంటిస్టులకు మంత్రి కొండా సురేఖ కీలక పిలుపు
పర్యావరణ ప్రేమికులకు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక పిలుపునిచ్చారు. దెబ్బతింటోన్న జీవవైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణ ప్రేమికులకు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక పిలుపునిచ్చారు. దెబ్బతింటోన్న జీవవైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గురువారం రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు(Telangana Biodiversity Board) ఏర్పాటు చేసిన నేషనల్ బయోడైవర్సటీ కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. మన పర్యావరణం, నీరు, భూ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. జీవవైవిధ్య పరిరక్షణ దిశగా సంరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు ఉపయుక్తంగా ఈ జీవవైవిధ్య సదస్సు ఉపయోగపడుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు, యువ సైంటిస్టుల(Young Scientists)కు జీవ వైవిధ్యం కోసం పని చేయాలని మంత్రి సురేఖ సూచించారు. అడవులు, పచ్చిక బయళ్ళు, తడి నేలలు, వృక్షాలు, జంతువులు ఇలా అనేకం తెలంగాణలో ఉన్నాయని అన్నారు. జీవవైవిధ్యం పర్యావరణ సమతుల్యతను సంరక్షించడం మన బాధ్యత అని తెలిపారు. అందుకోసం సమిష్టి కృషి జరగాలని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మానవ తప్పిదం వల్ల మొక్కలు, జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నాయని.. అయితే, వాటి సంరక్షణ కోసం మానవులుగా మనమే కృషి చేయాలని చెప్పారు. ఒక జాతి అంతరిస్తే దానిలోని జన్యుసంపద అంతరించినట్లే... జీవ వైవిధ్యపు నిజమైన విలువంతా జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుందని మంత్రి సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, చాలా సంస్థలు జీవ వైవిధ్య సంరక్షణలోనూ దాన్ని ప్రతిభావవంతంగా వినియోగించడంలోనూ నిమగ్నమై ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, ఈ నేషనల్ బయోడైవర్సటీ కాన్ఫరెన్స్ - 2025.. ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో రంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరగనుంది.






