కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి కొండా సురేఖ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

ఎన్నో ఏండ్లుగా అన్యాయానికి గుర‌వుతున్న రాష్ట్రంలోని 56 శాతం బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) న్యాయం చేయాల‌ని సంక‌ల్పించింద‌ని, బీసీ కుల గ‌ణ‌న‌(BC Caste Census)పై జ‌రిగే కుట్రల‌ను తిప్పి కొట్టాల‌ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి కొండా సురేఖ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఏండ్లుగా అన్యాయానికి గుర‌వుతున్న రాష్ట్రంలోని 56 శాతం బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) న్యాయం చేయాల‌ని సంక‌ల్పించింద‌ని, బీసీ కుల గ‌ణ‌న‌(BC Caste Census)పై జ‌రిగే కుట్రల‌ను తిప్పి కొట్టాల‌ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పిలుపునిచ్చారు. బీసీల‌కు బీఆర్ఎస్(BRS) చేసిందేమీ లేద‌ని, అసెంబ్లీలో, శాస‌న మండ‌లిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బీసీల‌ను అవ‌మానించార‌ని మండిప‌డ్డారు. కుల‌గ‌ణ‌న రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచ‌న అని, దాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆచ‌ర‌ణ‌లో సాధ్యం చేసి చ‌రిత్ర‌ను సృష్టించార‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా రాష్ట్రంలో బీసీల సంఖ్య పెరుగుతున్నా, సామాజిక న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బీసీల‌ను గ‌త ప్ర‌భుత్వం పూర్తిగా ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ సమ‌స్య‌ను తీర్చేందుకే త‌మ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీల కుల గ‌ణన చేప‌ట్టిన‌ట్టు చెప్పారు. అఖిల భార‌త కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్ గాంధీ ఆలోచనతో కుల గణన చేశామ‌న్నారు. కుల గ‌ణ‌న‌కి సంబంధించిన స్టేట్ మెంట్ మీద‌నే అసెంబ్లీ, శాస‌న‌మండ‌లిలో త‌మ ప్ర‌భుత్వం డిస్క‌సన్‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్టు చెప్పాఆరు. ఇంత కీల‌కమైన అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో బీఆర్ఎస్ చ‌ట్ట‌స‌భ స‌భ్యులు సమావేశాల మధ్యలోనే వెళ్లిపోవడంతో స‌రికాదు అన్నారు.

ఈ చ‌ర్య ద్వారా వారికి బీసీలపై ప్రేమ ఎంత ఉందో అర్థం అవుతుంద‌ని సురేఖ గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీల కోసం ఏమైనా చేశారా? అని ప్ర‌శ్నించారు. కనీసం వారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అయినా బయట పెట్టారా? అని నిల‌దీశారు. త‌మ ప్ర‌భుత్వం బీసీల కోసం చేస్తున్న కృషిని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు, బీఆర్ఎస్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా కుల గణన పై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. అయితే, కుల గణన అమలును అడ్డుకుంటే బీసీల‌కే నష్టమ‌ని సురేఖ అభిప్రాయ‌ప‌డ్డారు. తాను రెండు కులాల ప్రతినిధిగా చెప్తున్నాన‌ని, కుల గణన ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు.

Next Story