‘దత్తత తీసుకోండి’.. జంతు ప్రేమికులకు మంత్రి విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

హన్మకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్‌(Kakatiya Zoological Park)లో నిర్మించిన టైగర్ ఎన్ క్లోజర్‌లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్

‘దత్తత తీసుకోండి’.. జంతు ప్రేమికులకు మంత్రి విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్‌(Kakatiya Zoological Park)లో నిర్మించిన టైగర్ ఎన్ క్లోజర్‌లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి తీసుకొచ్చిన తెల్లపులిని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం ఎంక్లోజర్‌లోకి శుక్రవారం విడుదల చేశారు. అలాగే జూలోని జంతువుల సమాచారం తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్స్, చాట్ బాట్ మరియు వన మహోత్సవం కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... జూలోని జంతువులను దత్తత తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. జూ పార్కును మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని జంతు ప్రేమికులకు(Animal Lovers) మంత్రి విజ్ఞప్తి చేశారు.

Next Story