Konda Surekha: కేటీఆర్.. మీ చెల్లి కవితను చూసి నేర్చుకో! మంత్రి కొండా సురేఖ కౌంటర్

by Ramesh Naini |

సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు.

Konda Surekha: కేటీఆర్.. మీ చెల్లి కవితను చూసి నేర్చుకో! మంత్రి కొండా సురేఖ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ (KTR) వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆమె మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. రీ సర్వే అంటున్న కేటీఆర్.. తన చెల్లి (MLC Kavitha) కవితను చూసి నేర్చుకోవాలని సూచించారు. (caste census) రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్ ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సర్వే, ప్రొఫార్మా లో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తదనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదని, ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది తనకు తెలీదని, తాను ఎవరిని ఎంకరేజ్ చేయడం లేదన్నారు. దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని, అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బంది అవుతుందన్నారు. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమి కాదని తెలిపారు. లీగల్ లిటికేషన్స్ లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంబాభిషేకం చేయాలో లిస్ట్ తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుందని తెలిపారు. ఫారెస్ట్‌లో సర్వేయర్ల ప్రొటెక్షన్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని, గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారమని ఆరోపించారు. (Eatala Rajendar) ఎంపీ ఈటల రాజేందర్‌పై త్వరలోనే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.

Next Story