TG Secretariat: కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Telangana Secretariat)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

TG Secretariat: కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Telangana Secretariat)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సెక్రటేరియట్‌లోని కేబినెట్ హాల్ దగ్గర మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆమె సిబ్బంది వైద్యులకు సమాచారం ఇచ్చారు. పరీక్షల అనంతరం ఆమె మంత్రి సురేఖ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. లోబీపీ కారణంగా కళ్లు తిరిగి ఉంటాయని వైద్యులు చెప్పారు. ఇంజెక్షన్‌ ఇచ్చిన డాక్టర్లు, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు.

అంతకుముందు పీసీబీ కార్యాలయంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకల్లో మంత్రి సురేఖ పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకొని... భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత.. మన అందరిపై ఉందని అన్నారు. యావత్ ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం ఆమె అభిప్రాయపడ్డారు.

మనం అందరం కలిసి మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి.. సంరక్షించుకోవాలనే బాధ్యతను ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇదొక విప్లవాత్మకమైన చర్యగా తాను అభివర్ణిస్తున్న అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గూగులోత్, పిసిబీ బోర్డు మెంబర్లు సత్యనారాయణ రెడ్డి, విజయ లక్ష్మీ, జయదేవ్, పీసీబీ ఉద్యోగులు, సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story