Konda Surekha: అడవుల్లో అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం అప్రమత్తం! మంత్రి కొండా సురేఖ సమీక్ష

by Ramesh Naini |

వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించి అటవీ సంపద కాస్తా బూడిదవుతాయి.

Konda Surekha: అడవుల్లో అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం అప్రమత్తం! మంత్రి కొండా సురేఖ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించి అటవీ సంపద కాస్తా బూడిదవుతాయి. ఏటా ప్రమాదాలతో వేలాది వృక్షాలు మంటలకు ఆహుతి అవుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో అడవుల్లో వంట చేయడం, సిగరెట్, బీడీ, చుట్ట లాంటివి తాగి అక్కడ పడేయడంతో అటవీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు (Forest Department) ఫారెస్ట్​ డిపార్ట్మెంట్​ నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఎండ వేడిమికి వన్య ప్రాణులు సైతం తీవ్రంగా అల్లాడిపోతాయి. ఈ నేపథ్యంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలు వాటి నివారణ, వన్యప్రాణి సంరక్షణపై తీసుకునే చర్యలపై సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్. సువర్ణ, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) ఈలు సింగ్ మేరు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్చువల్ ద్వారా సమావేశంలో వివిధ జోన్ల సీసీఎఫ్‌లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలు పాల్గొన్నారు. కాగా, తెలంగాణలో గత కొంతకాలం కిందట అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర ప్రాంతాల్లో అటవీ ప్రమాదాలు జరిగాయని ఫారెస్ట్​ డిపార్ట్మెంట్​ నివేదికలు చెబుతున్నాయి.

Next Story