మంత్రి కొండా సురేఖ OSD సుమంత్ తొలగింపు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీని తొలగించింది.

మంత్రి కొండా సురేఖ OSD సుమంత్ తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీని తొలగించింది. కాలుష్య నియంత్రణ బోర్డులో ఒప్పంద ఉద్యోగిగా ఓఎస్‌డీ సుమంత్ కొనసాగుతున్నారు. పరిపాలనా కారణాలతో సుమంత్‌ను తొలగిస్తున్నట్లు సీబీబీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌‌ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్లలో ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేవాదాయశాఖకు చెందిన రూ.71కోట్ల టెండర్‌ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని కొండా సురేఖ విమర్శించారు. అయితే మంత్రుల మధ్య వివాదానికి ఓఎస్‌డీ సుమంతే కారణమని.. అందుకే అతన్ని తొలగించారని ప్రచారం జరుగుతోంది.

Next Story