నరేందర్ రెడ్డి కూడా అలాగే పనిచేస్తారు.. మంత్రి కొండా సురేఖ భరోసా

by Gantepaka Srikanth |

మెద‌క్‌ - క‌రీంన‌గ‌ర్‌ - ఆదిలాబాద్‌ - నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌(Graduate MLC Election)ల్లో బీజేపీ(BJP)కి ఓటు అడిగే నైతిక హక్కు లేద‌ని తెలంగాణ

నరేందర్ రెడ్డి కూడా అలాగే పనిచేస్తారు.. మంత్రి కొండా సురేఖ భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: మెద‌క్‌ - క‌రీంన‌గ‌ర్‌ - ఆదిలాబాద్‌ - నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌(Graduate MLC Election)ల్లో బీజేపీ(BJP)కి ఓటు అడిగే నైతిక హక్కు లేద‌ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధ‌ర్మాదాయ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కరీంనగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి(Narender Reddy) నామినేషన్ ర్యాలీలో సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డితో పాటు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో జీవన్ రెడ్డి(Jeevan Reddy)ని గెలిస్తే పట్టభద్రుల గొంతుకగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం తమ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా అదే మాదిరిగా పని చేస్తారని భరోసా ఇచ్చారు.

నరేందర్ రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తార‌ని హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Conress Govt) వచ్చాక విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకువచ్చామని సురేఖ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాల‌న‌లో 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామ‌ని, వచ్చే సంవత్సరం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామ‌న్నారు. గ‌త పదేళ్లలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తాము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రైతు భరోసా, రైతు రుణ మాఫీ 500 గ్యాస్ సిలిండర్‌ను అమలు చేశామని చెప్పారు. పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి గెలిపించాల‌ని కోరారు.

Next Story