అది తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం.. శ్రీరామనవమి వేళ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుభాకాంక్షలు తెలిపారు.

అది తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం.. శ్రీరామనవమి వేళ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి(Sri Ram Navami) వేడుకలు ఘనంగా జరపాలని అధికారులను ఆదేశించారు. "శ్రీరాముడు సత్యానికి, న్యాయానికి, మంచి నీతి జీవనానికి నిలువెత్తు ప్రతిరూపమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో శ్రీరాముని జీవితం ఒక గొప్ప మార్గదర్శకమని శాంతి, సహనం, విశ్వాసం, కష్టనష్టాలను అధిగమించే స్థైర్యం వంటి విలువలను శ్రీరాముని జీవితం మనకు నేర్పుతుందని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు.


ఈ పండుగ పర్వదినం ప్రజలందరికీ సంతోషం, ఆయురారోగ్యం, శాంతి, ఐశ్వర్యాలను అందించాలని ఆకాంక్షిస్తూ, రామ నామ స్మరణతో మనలో ధర్మపథంలో నడిపించే శక్తిని ఇస్తుందన్నారు. "ప్రతి ఒక్కరికి న్యాయం, సమానత్వం కలిగే రామ రాజ్యం లాంటి పాలన అందాలని సురేఖ ఆకాంక్షించారు. గోదావరి నదీ తీరాన సీతాసమేతంగా కొలువై ఉన్న శ్రీరాముని ఆలయం భద్రాచలం(Bhadrachalam). 'దక్షిణ అయోధ్య'గా భద్రాచలం పేరుగాంచిందని, అలాంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం నిజంగా మన అదృష్టమన్నారు. భక్తి, శ్రద్ధలతో శ్రీరామనవమిని జరుపుకోవాలని, ప్రజలందరికీ ఈ పర్వదినం శుభ ఫలితాలను అందించాలని కోరుకుంటున్నాని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Next Story