- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడ్జెట్‌పై తెలంగాణ మంత్రి స్పందన.. అభ్యర్థనను కేంద్రం కనీసం పట్టించుకోలేదని ఫైర్
కేంద్ర బడ్జెట్(Union Budget-2025)లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్(Union Budget-2025)లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆరోపించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘కేంద్ర బడ్జెట్ చాలా నిరాశకు గురి చేసింది. దేశంలోని చిన్న రాష్ట్రమైన తెలంగాణకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నుంచి తగినంత కేటాయింపులు రాలేదనే బాధను వ్యక్తపరచడానికి నాకు మాటలు రావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చిన అభ్యర్థనలను పట్టించుకోలేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కఠినంగా విస్మరించారు’ అని కొండా సురేఖ సీరియస్ అయ్యారు.
కాగా, ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను లేదని స్పష్టం చేశారు. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంచారు. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. మరోవైపు.. ఈ బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయని కొనియాడారు. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్‌లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి.
Completely disappointed with the Union Budget.
— Konda Surekha (@iamkondasurekha) February 1, 2025
I have no words to express the sadness of not receiving enough allocation to the younger state of the country, Telangana, from India’s Finance Minister, @nsitharaman.
The requests from southern states were overlooked, and… pic.twitter.com/YwzqGSpESZ






