బనకచర్లను కట్టనివ్వం: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

బనకచర్లను కట్టనివ్వమని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

బనకచర్లను కట్టనివ్వం: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల(Banakacharla)ను ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టనివ్వమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Telangana Minister Komatireddy Venkat Reddy) అన్నారు. గోదావరిపై పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacharla Project) కట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు కోరుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తుండటంతో ఆయన స్పందించారు. బనచర్లపై కోర్టుకు వెళతామని చెప్పారు. స్వయంగా చంద్రబాబే వచ్చినా బనకచర్లను అడ్డుకుంటామన్నారు. బనకచర్ల నిర్మాణాన్ని విరమించుకోవాలని సూచించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

Next Story