- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ : మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు పడుతుందనే ప్రతిపక్షనేత కేసీఆర్ నేటి అసెంబ్లీ సమావేశాలకు రావాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కింజరపు రామ్మోహన్‌లను కలిసిన అనంతరం కోమటిరెడ్డి ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవితలు కులగణనలో పాల్గొన లేదన్నారు. బీఆర్ఎస్కు అసలు బీసీ కులగణనపై మాట్లాడే హక్కే లేదన్నారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే స్పందించని కేసీఆర్ ఆయన ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్‌ను సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు. మాసాయిపేట ప్రమాదంలో చిన్న పిల్లలు చనిపోతే కేసిఆర్వె ళ్లలేదన్నారు. తెలంగాణ కోసం కేసిఆర్ దొంగ దీక్షలు చేశారన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీకి ఎలాంటి గొడవలు జరగలేదన్నారు. రేవంత్ రెడ్డినే పదేళ్లు సీఎంగా ఉంటారన్నారు. సీఎం మార్పు అనేది కేవలం ప్రచారమే తప్ప వాస్తవం కాదన్నారు.






