రివేంజ్ పాలిటిక్స్‌పై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రివేంజ్ పాలిటిక్స్‌పై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రివేంజ్ పాలిటిక్స్‌పై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది, కూట్రపూరితంగానే ఫార్ములా-ఈరేసు కేసులో ఇరికిస్తున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీకి రివేంజ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. ఫార్ములా-ఈరేసు కేసులో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారు.. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదని అన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారు.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. అంతకుముందు.. నల్గొండ జిల్లాలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని మంత్రి కోమటిరెడ్డి కోరారు. నల్గొండలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎఫ్‌సీఐ డివిజనల్ ఆఫీస్, బఫర్ స్టోరేజ్ కాంప్లెక్సును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

Next Story