- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్యూనిస్టులపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కమ్యూనిస్టుల(Communists)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టుల(Communists)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘నల్గొండ నేలపై, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డిని స్మరించుకునే సభలో పాల్గొని నా హృదయ పూర్వక నివాళులు అర్పించాను. అజాతశత్రువుగా, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం కమ్యూనిస్టుగానే నిలిచారు. నల్గొండ ఎంపీగా కార్మికుల కోసం, రైతుల కోసం, ప్రజల ప్రతి సమస్య పరిష్కారం కోసం ఆయన పోరాటం చేసిన తీరు నల్లగొండ నేలకి శాశ్వత గౌరవం.
కమ్యూనిస్టుల పోరాటం పదవుల కోసం కాదు, ప్రజల కోసం మాత్రమే అని ఆయన జీవితం సాక్ష్యంగా నిలిచింది. ప్రజల కోసం బతికిన ఆయన, మరణానంతరం కూడా వైద్య విద్యార్థుల కోసం తన శరీరాన్ని దానం చేయాలనుకున్న అపూర్వ మహానుభావుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజల ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుంది. సుధాకర్ రెడ్డి సేవలకు గుర్తుగా ఆయన విగ్రహం నెలకొల్పి, ఒక గొప్ప కార్యక్రమానికి ఆయన పేరు ఇవ్వడానికి నా వంతు కృషి చేస్తాను’ అని కోమటిరెడ్డి కీలక హామీ ఇచ్చారు.






