Minister Komatireddy: మామ, అయ్య పేరు చెప్పుకుని మేం ఎమ్మెల్యేలం కాలే.. మంత్రి కోమటి‌రెడ్డి ఫైర్

by Shiva |
Minister Komatireddy: మామ, అయ్య పేరు చెప్పుకుని మేం ఎమ్మెల్యేలం కాలే.. మంత్రి కోమటి‌రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) చంటి పిల్లల్లా మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే తట్టుకోలేక బీఆర్ఎస్ (BRS) డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపిందని మండిపడ్డారు. మామ, తండ్రి పేరు చెప్పుకుని హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌ (KTR)లాగా తాము వారసత్వంగా ఎమ్మెల్యేలం కాలేదని కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఏళ్లు గడిచినా.. ఇంకా చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ (BR Ambedkar)కు ఎన్నడైనా కేసీఆర్ (KCR) నివాళులర్పించారా అని ప్రశ్నించారు.

రేప్‌, మర్డర్ కేసులు ఉన్న వ్యక్తులను పురమాయించి లగచర్ల (Lagacharla)లో కలెక్టర్ (Collector), అధికారుల (Officers)పై కేటీఆర్ (KTR) దాడులు చేయించి భూసేకరణను అడ్డుకున్నారని ఆరోపించారు. ఏదో విధంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ.. అటంకం సృష్టించడమే బీఆర్ఎస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ (SLBC Project), స్కిల్ యూనివర్సిటీ (Skill University), రూ.500 లకే ఉచిత సిలిండర్, గృహలక్ష్మి పథకం కింది ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకాలను అమలు చేయడం వారికి మింగుడు పడటం లేదని.. అందుకే విపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. సెక్రటేరియట్ (Secretariat) ఎదుట ప్రతిష్టించే తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ మహిళలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.



Next Story