మరో 15 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Ajay Maddhiboyina |

రాబోయే ఐదేళ్లు మాత్ర‌మే కాకుండా మ‌రో ప‌దిహేనేళ్లు తామే అధికారంలో ఉంటామ‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో రూ.74 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

మరో 15 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: రాబోయే ఐదేళ్లు మాత్ర‌మే కాకుండా మ‌రో ప‌దిహేనేళ్లు తామే అధికారంలో ఉంటామ‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో రూ.74 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని ప్ర‌జ‌ల‌కు కూడా అర్థం అయ్యింద‌న్నారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డానికి మీటింగ్ పెట్టుకోలేద‌ని తిట్టాలి అన్నా ఓ పార్టీ డిపాజిట్లు కోల్పోయింద‌న్నారు. ఇంకో పార్టీ మూడు ముక్కలైంద‌ని అన్నారు. అక్కా చెల్లెళ్లు, బావా బామ్మ‌ర్దులు కొట్లాడుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. మిర్యాల‌గూడ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క స‌ర్పంచ్ కూడా పోద‌ని మాట ఇవ్వాల‌న్నారు.

Next Story