- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Komatireddy: దేశానికే మోడల్‌గా కోహెడ మార్కెట్
by Gantepaka Srikanth |
రైతుల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

X
దిశ, రంగారెడ్డి బ్యూరో: రైతుల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో గురువారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొమటిరెడ్డి ప్రసంగించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దేశానికి మోడల్‌గా ఉండే మార్కెట్‌ను నిర్మించబోతున్నామని అన్నారు. కోహెడ ప్రాంతంలో రూ.2వేల కోట్ల వ్యయంతో 2 ఎకరాల్లో ఆధునాతన హంగులతో ఏర్పాటుకు శ్రీకారం చూడుతున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో నిర్ణయం చేయడం జరిగిందని వివరించారు. సీఎంతో పాటు మరొకోద్ది మంది పెద్దలతో మార్కెట్పనుల శంఘుస్ధాపన జరగనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
Next Story






