- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రేవంత్‌ను తిడితే ఊరుకోను’.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కవిత.. కేసీఆర్ వదిలిన బాణం అని అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కవిత.. కేసీఆర్ వదిలిన బాణం అని అన్నారు. ఆమె కన్ఫ్యూజన్‌లో ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.. కవితను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతున్నారు.. ఆమె బీఆర్ఎస్‌లో ఉందా? ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని కోమటిరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. తన తండ్రి మీద సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత.. హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న నాయకులు అందర్నీ దూరం చేసేందుకు కవిత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తంమరిగిపోయిందన్న కవిత, కేటీఆర్, హరీష్ రావులను ఉరితిసినా తప్పు లేదా కవిత చెప్పాలని అడిగారు.
రేవంత్‌ను తిడితే ఊరుకోను..
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని కవిత అంటున్నారనంటే ఆమె బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టుగా అనుమానం ఉందన్నారు. కేసీఆర్‌ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకోవడం సంతోషం.. బీఆర్ఎస్ హాయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు సీఎం అంటే గౌరవం.. సీఎం రేవంత్‌ను ఎవరు ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తా.. నాకు మంత్రి పదవి కావాలని ఎవరినీ అడగలేదన్నారు. నాకు మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవు.. నేను మంత్రి పదవి కోసం ఏ రోజూ పాకులాడలేదు.. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు.






