- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి అజాగ్రత్తగా ఉండకండి.. యువతకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Hayatnagar Accident) జరిగిం అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Hayatnagar Accident) జరిగిం అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కుంట్లూరులోని నారాయణ కాలేజీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 5.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అంతేకాదు.. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) దిగ్భ్రాంతికి గురయ్యారు. మధ్యాహ్నం స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చాలా బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన యువకుల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అని ఎమోషనల్ అయ్యారు. వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటూ ఓదార్చారు. రెప్పపాటులో జరిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు మనోవేదనను అనుభవిస్తున్నాయని అన్నారు. వేగంగా డ్రైవ్ చేయడం ప్రమాదకరమైనది.. దయచేసి వేగంగా డ్రైవ్ చేయకండి. అజాగ్రత్తగా డ్రైవ్ చేయకండి. మీ ప్రాణం మరియు ఇతరుల ప్రాణాలను రక్షించడానికి, వేగ పరిమితిలో ఉండండి. మరియు సురక్షితమైన డ్రైవింగ్ చేయండి’ అని యువతకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇవాళ ఉదయం హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు యువకులు దుర్మరణం చాలా బాధాకరం..
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) May 21, 2025
వారి భౌతిక కాయాన్ని సందర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..
వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం..
వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని… pic.twitter.com/1oZ5SOwxY1






