- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్‌అండ్‌బీ శాఖ(R&B Department) పరిధిలోని పనుల పురోగతిని సమీక్షించేందుకు ఎర్రమంజిల్ కార్యాలయంలో అధికారులు, ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌అండ్‌బీ శాఖ(R&B Department) పరిధిలోని పనుల పురోగతిని సమీక్షించేందుకు ఎర్రమంజిల్ కార్యాలయంలో అధికారులు, ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ పరిధిలోని అన్ని రకాల పనుల్లో వేగం పెంచాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీ.ఈ లు ఫీల్డ్ విజిట్లు చేయాలని, ప్రతి రివ్యూకు పనుల పురోగతి చూపించాల్సిందిగా సూచించారు. హ్యామ్ రోడ్ల ప్యాకేజీలపై రెండు రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. బ్లాక్ స్పాట్స్, వర్టికల్ కర్వ్స్ ముందే గుర్తించాలని అన్నారు. ప్రొజెక్టుల పూర్తి కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో మాట్లాడి ప్రమోషన్లు, పోస్టింగ్స్ పూర్తి చేశాం.. ఇప్పుడు ఫలితాలు చూపించాల్సిన సమయం వచ్చిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల విషయంలో శాఖకు పూర్తి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలకు హాస్పిటల్స్, రోడ్ల నిర్మాణం త్వరగా అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.






