- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటోన్మెంట్లో సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు.. జూబ్లీహిల్స్‌లో కూడా కాదు: మంత్రి కోమటిరెడ్డి
కంటోన్మెంట్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదని, ఇక్కడ జూబ్లీహిల్స్ కూడా కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కంటోన్మెంట్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదని, ఇక్కడ జూబ్లీహిల్స్ కూడా కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి మద్దతుగా ఆదివారం రహ్మత్ నగర్ డివిజన్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) దోపిడీ భరించలేక ప్రజలు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. (Jubilee Hills) జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా పెద్ద ఎత్తున కనిపిస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
పదేళ్లు సీఎం గా పని చేసిన కీసీఆర్ మా అభ్యర్థి గురించి మాట్లాడాడు అంటే మా విజయం అక్కడే అర్థం అవుతుందని అన్నారు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే పోయిన ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ నేతలపై బయట పెట్టాలని అన్నారు. కావాలని మా అభ్యర్థిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అంటే క్లాస్ పీపుల్ అని అందరూ అనుకుంటారు కానీ ఇది మాస్ ఏరియా అని అన్నారు. మాస్ ఏరియా వాళ్లకి అభివృద్ధి, సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ నే గుర్తు వస్తుందన్నారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ను జూబ్లిహిల్స్ ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. వివరాల కోసం క్లిక్ చేయండి..
READ MORE ....
జూబ్లీహిల్స్‌లో మా విజయం ఖరారైంది.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి






