ఎన్ని నిధులైనా ఇస్తా.. మీరే నా బలం.. బలగం: మంత్రి కోమటిరెడ్డి

by Gantepaka Srikanth |

ఎన్ని నిధులైనా ఇస్తా.. మీరే నా బలం.. బలగం: మంత్రి కోమటిరెడ్డి

ఎన్ని నిధులైనా ఇస్తా.. మీరే నా బలం.. బలగం: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) హామీ ఇచ్చారు. శుక్రవారం నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లోని పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను క్యాంపు కార్యాలయంలో కలసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పదవులు శాశ్వతం కావు.. కాబట్టి వచ్చిన అవకాశాన్ని గ్రామాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు.

Next Story