- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత లేఖను చుసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. మంత్రి కోమటిరెడ్డి సెటైర్
కేటీఆర్, హరీష్ రావు కలిసిన ఇంట్లో కూర్చొని రాసిన లేఖ అది. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదుగాని విలేకర్లు అడుతున్నారని చెబుతున్నాని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్, హరీష్ రావు కలిసిన ఇంట్లో కూర్చొని రాసిన లేఖ అది. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదుగాని విలేకర్లు అడుతున్నారని చెబుతున్నాని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి విలేకర్లతో చేసిన చిట్ చాట్‌లో మాట్లాడారు. కవిత లేఖను, ఆ పార్టీని ప్రజలెవరు నమ్మడం లేదు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా గెలువాలని లేఖ డ్రామా మొదలు పెట్టారని మంత్రి ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టలేకపోయారు. బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించారు. దీంతో ముస్లింలు ఓటర్లు దూరం అయ్యారు. హిందువులు కూడా ఓట్లు వేయరని, పార్టీని వీడిపోతున్నట్లు, తెలంగాణ ప్రజల మైండ్‌ను డైవర్ట్ చేసేందుకు కవిత పేరుతో లేఖ డ్రామాను తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు.
ఆ కుటుంబం ఎప్పటికీ విడిపోదు. వంద జాకీలు పెట్టినా లేవని పార్టీ బీఆర్ఎస్. కవిత రాసిన లేఖ అనే జాకీతో లేస్తుందా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేరుతో ఆ నాడే టీఆర్ఎస్‌ను బొంద పెట్టారు అంటూ విమర్శించారు. కవిత గురించి, బీఆర్ఎస్ గురించి ఎవరు మాట్లాడటం లేదు. లేఖలో పేర్కొన్న అంశాలను చూస్తే తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. వరంగల్‌లో మీటింగ్ పెడితే రాజు, యువరాజుల తలలే కనిపించాయి. మీటింగ్‌కు జన సమీకరణ చేసిన హరీష్ రావు ఫొటో కూడా ఎక్కడా పెట్టలేదు. ఆ మీటింగ్‌లో రెండే నిమిషాలు కూడా ముస్లింల గురించి, కులగణనపై మాట్లాడలేదు. లేఖ రాసే బదులు కవిత నేరుగా కేసీఆర్‌ను కలిసి మాట్లాడొచ్చు.
80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి కవిత సలహాలు ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు అంటే నేను ఒప్పుకోను. సకల జనులు సమ్మె చేసి, నాలాంటి కాంగ్రెస్ నేతలు మంత్రి పదవులు వదులుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇది చెప్పకుండా ప్రజలకు మాయమాటలు చెప్పి కేసీఆర్ ఆనాడు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులు, పాపాలకు వడ్డీలు కట్టలేక పోతున్నామని అన్నారు. ప్రభాకర్ రావు వస్తే అన్ని బయటపడతాయి. కేసీఆర్ తప్పు చేయకుంటే కమిషన్ ముందు హాజరు అవ్వాలి.. తప్పు చేస్తే ఒప్పుకోవాలి లేకపోతే తప్పు చేయలేదు అని చెప్పాలి. సీఎంవో అధికారి హెలికాప్టర్లో మిషన్ భగీరథ పైపులు అని వారానికి మూడుసార్లు రాష్ట్రం అంతా తిరిగింది. దాని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 70 ఏళ్లు ఉంటాం అనుకొని తొమ్మిదిన్నర ఏళ్లు లేకుండాపోయేసరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు ఏం మాట్లాడాలో తెలియటం లేదని మంత్రి ఘాటుగా విమర్శించారు.






