- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకపై ఏ సినిమా టికెట్ ధరలను పెంచేది లేదు : మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సినిమా టికెట్ ధరలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఓజీ సినిమా (OG Movie) టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. దానిని సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కొత్త సినిమాల టికెట్ల ధరలను పెంచడాన్ని సస్పెండ్ చేసింది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పందించారు. సినిమా టికెట్ ధరలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచేది లేదని తాను గతంలోనే అసెంబ్లీలో చెప్పానని, పక్క రాష్ట్రం జీఓ ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకు వెసులుబాటు ఇచ్చామని పేర్కొన్నారు.
ఇకపై ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరలను పెంచుకునేలా అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు కారణంగా సామాన్యుడు చాలా నష్టపోతున్నాడన్నారు. ఇకపై సినిమా టికెట్ రేట్ల పెంపుపై జీఓలు ఉండవని తెలిపారు. సినీ ఇండస్ట్రీని హైదరాబాద్ హబ్ గా మారుస్తామని, ఇందుకోసం ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలకైనా సిద్ధంగా ఉన్నామని, అభిమానులపై మాత్రం భారం వేయకూడదని చెప్పారు.






