సెంటిమెంట్‌తో గెలవడం అన్ని సమయాల్లో జరగదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-06 09:07:37  IST  )

జూబ్లిహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సెంటిమెంట్ తో గెల‌వ‌డం అనేది అన్ని స‌మయాల్లో జ‌ర‌గ‌ద‌ని చెప్పారు. పీజేఆర్ చ‌నిపోయిన‌ప్పుడు ఆయ‌న భార్య వెళితే 3గంట‌ల పాటు అపాయింట్మెంట్ ఇవ్వ‌లేద‌న్నారు.

సెంటిమెంట్‌తో గెలవడం అన్ని సమయాల్లో జరగదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సెంటిమెంట్ తో గెల‌వ‌డం అనేది అన్ని స‌మయాల్లో జ‌ర‌గ‌ద‌ని చెప్పారు. పీజేఆర్ చ‌నిపోయిన‌ప్పుడు ఆయ‌న భార్య వెళితే 3గంట‌ల పాటు అపాయింట్మెంట్ ఇవ్వ‌లేద‌న్నారు. అప్పుడు సెంటిమెంట్ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. సెంటిమెంట్ ప‌నిచేస్తే కంటోన్మెంట్ లోనే బీఆర్ఎస్ గెలిచేద‌ని చెప్పారు. జూబ్లిహిల్స్ లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు త‌మ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేసేందుకు స్వ‌చ్చందంగా ముందుకు వ‌స్తున్నార‌ని అన్నారు. ప్ర‌జలే ముందుకు వ‌చ్చి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామ‌ని చెబుతున్నార‌న్నారు.

గ్రామాల నుండి వ‌చ్చి సైతం కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలిపారు. అధికార పార్టీగా తాము చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల వ‌ల్ల‌నే జ‌నాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నార‌ని అన్నారు. ఒక్క జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోనే 20వేల రేష‌న్ కార్డులు ఇచ్చామ‌ని, ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ప్ర‌క్రియ ఆగిపోయింద‌న్నారు. ఎన్నిక‌లు పూర్తైన వెంట‌నే రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇత‌ర ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌న్నారు. కారు కావాలా బుల్డోజ‌ర్ కావాలా అంటున్నార‌ని కానీ అస‌లు కారు గుర్తే లేద‌ని చెప్పారు. 30 నుండి 50వేల మెజార్టీతో తాము గెలుస్తున్నామ‌ని తెలిపారు. న‌వీన్ యాద‌వ్ రౌడీ షీట‌ర్ అయితే కేటీఆర్ ఒక్క ఎఫ్‌ఐఆర్ తీసుకురావాలన్నారు.

Next Story