‘అసెంబ్లీకి రాకపోతే మేము అదే ఫిక్స్ అవుతాం’.. కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘అసెంబ్లీకి రాకపోతే మేము అదే ఫిక్స్ అవుతాం’.. కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే కాళేశ్వరంలో జరిగిన తప్పును ఒప్పుకున్నట్లే అని చెప్పారు. అసెంబ్లీకి రావాల్సిందే.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు. తప్పు జరిగింది కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కోర్టుకు కూడా వెళ్లారని అన్నారు. కాగా అంతకుముందు అసెంబ్లీలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి శాససనభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్‌ చురుగ్గా ఉండేవారని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్‌, రంగారెడ్డి మృతిపట్ల మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

Next Story