- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పత్తి రైతుల కష్టాలు తీర్చాలని CCI ఛైర్మన్‌ను విజ్ఞప్తి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా పత్తి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ముంబైలో CCI చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా పత్తి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించారు. సమావేశంలో పత్తి మద్దతు ధర (MSP) పెంపు, తేమ శాతం సడలింపు, పత్తి సేకరణ విస్తరణ వంటి ముఖ్య అంశాలను మంత్రి ప్రస్తావించారు. వర్షాల కారణంగా పత్తి తేమ శాతం పెరగడంతో 8-12% ప్రస్తుత నిబంధనలను 14% వరకు సడలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే మంత్రి కోమటిరెడ్డి, పత్తి రైతుల నష్టాన్ని తగ్గించడానికి MSP పెంపు అవసరమని, పత్తి కొనుగోలు కేంద్రాలను అన్ని జిల్లాలకు విస్తరించి ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని నివారించాలని CCI చైర్మన్‌కి సూచించారు. అలాగే తెగులు, వర్ష నష్టాల కారణంగా రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ ఇవ్వాలని, గత సీజన్లలో చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ అంశాలన్నింటినీ సానుకూలంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కోసం కృషి చేస్తామని సిసిఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా మంత్రి కోమటిరెడ్డికి హామీ ఇచ్చారు. ఈ భేటీలో మంత్రితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా హాజరయ్యారు.






