- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Komatireddy: ప్రతిపక్షాలకు పని లేదు.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) పాలనలో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కామెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (Marri Chenna Reddy Human Resource Development Centre)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం (CLP Meeting)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటి సారిగా కులగణన (Cast Census) చేసి చరిత్ర సృష్టించామని, దేశానికి దిక్సూచిగా నిలిచామని తెలిపారు. ఇక నుంచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ (Congress Party) గెలిచి తీరుతుందని కామెంట్ చేశారు. మరో 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో అధికారంలో ఉండటం ఖాయమని అన్నారు.
సీఎల్పీ (CLP) సమావేశంలో ముఖ్యంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించామని క్లారిటీ ఇచ్చారు. సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారని తెలిపారు. అదేవిధంగా తొలిసారి ఎమ్మెల్యే కావడం సులభమేనని.. కానీ దానిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే తప్పేనా.. అని అన్నారు. ఆ విషయాన్ని కూడా ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేదని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) ప్రజలకు ఏం చేయలేదని.. నేడు తమ ప్రభుత్వంపై సోషల్ మీడియా (Social Media)లో విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులగణనపై సర్వేలో పాల్గొనని వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
సీఎస్పీ మీటింగ్‌కు తీన్మార్ మల్లన్న డుమ్మా..
హైదరాబాద్ (Hyderabad)లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (Marri Chenna Reddy Human Resource Development Centre)లో జరిగిన సీఎస్పీ సమావేశానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గైర్హాజయ్యారు. ఐదు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో 56 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు, హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఒకవేళ ఆయనకు నోటీసులు అందకపోతే మళ్లీ ఇస్తామని అన్నారు.