- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్‌కు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు.. విషయమిదే!
CM రేవంత్‌కు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు.. విషయమిదే!

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన ‘తెలంగాణ రైజింగ్–2047’ పాలసీ డాక్యుమెంట్ & గ్లోబల్ సమ్మిట్‌పై జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘సీఎం రేవంత్ పరిచయం చేసిన తెలంగాణ రైజింగ్–2047 విజన్, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి స్పష్టమైన దిశను సూచిస్తోంది. ప్రణాళికబద్ధమైన అర్బన్ ఎకానమీ, రీజనల్ రింగ్ రోడ్లు, కొత్త ఎయిర్‌పోర్టులు, హైవే–పోర్ట్ కనెక్టివిటీ, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే విధానాలతో తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాలు, ప్రపంచ నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికలో తెలంగాణ చేనేతకు ప్రతీకగా నిలిచే పోచంపల్లి కళాత్మకతను ప్రత్యేకంగా ప్రదర్శించినందుకు ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. పోచంపల్లి కళాత్మకతను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే ఈ నిర్ణయం, రాష్ట్ర సాంస్కృతిక గౌరవానికి మరో ముఖ్యమైన గుర్తింపు. తెలంగాణను “CURE–PURE–RARE” మోడల్‌తో, 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే ఈరోజు ఆవిష్కరించిన విజన్ యొక్క ప్రధాన దిశ. తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌పై మరింత బలంగా నిలబెట్టేందుకు మేమంతా కలిసి శ్రమిస్తాము. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఇది మరో కీలక ముందడుగు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోస్టు పెట్టారు. ట్వీట్






