- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Minister Komatireddy: ఓ చిల్లర ఎమ్మెల్యే గురించి ఇంత డ్రామానా.. మంత్రి కోమటి రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఓ చిల్లర ఎమ్మెల్యే గురించి బీఆర్ఎస్ (BRS) నేతలు ఇంత డ్రామా ఆడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy) ఫోన్ ట్యాప్ (Phone Tapping) చేయాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. బంజారా హిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కౌశిక్‌రెడ్డి (Koushik Reddy) అక్కడ సిబ్బందిపై దౌర్జన్యం చేయడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. వారి విధులకు భంగం వాటిల్లేలా ప్రవర్తించినందుకే ఆయనపై కేసు నమోదైందని తెలిపారు.
ఈ మధ్య హరీశ్‌రావు (Harish Rao) మానసిక స్థితి బాగోలేదని కామెంట్ చేశారు. చట్ట ప్రకారం కౌశిక్‌రెడ్డి (Koushik Reddy)ని అరెస్ట్ చేశారని అన్నారు. ఓ చిల్లర ఎమ్మెల్యే గురించి బీఆర్ఎస్ (BRS) నేతలు ఇంత డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌పై అక్రమ కేసులు పెట్టారంటూ గొంతు చించుకుని అరుస్తున్న హరీశ్‌రావు (Harish) ఏ హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.