- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Komatireddy: త్రివేణి సంగమంలో మంత్రి కోమటిరెడ్డి పుణ్య స్నానం..

దిశ, వెబ్‌డెస్క్: అనంత విశ్వంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తర్‌ప్రదేశ్ (Uttar PradesH) రాష్ట్రంలో ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతోన్న మహా కుంభమేళా (Maha Kumbhmela)కు దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మామూలు జనంతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద పుణ్య స్నానాలు ఆచరించించి అక్కడ ఉన్న ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కుంభమేళాకు వెళ్లారు. అనంతరం అక్కడి ఘాట్‌లలో గంగా, యమునా నదులకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి త్రివేణి సంగమం (Triveni Sangam) ఘాట్ వద్దకు వెళ్లి పుణ్య స్నానం ఆచరించారు.
రాష్ట్రం అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆయన ప్రార్థించారు. వేదపండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని (Bade Hanuman Temple) సందర్శించి ఆంజనేయ స్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ (DK Shiva Kumar), కుటుంబంతో సహా కుంభమేళాకు హాజరైన త్రివేణి సంగమం (Triveni Sangam)లో పుణ్య స్నానాలు ఆచరించారు.
కాగా, ఈ మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పాలు పంచుకుని పుణ్య స్నానాలు చేశారు. మూవీ ఇండస్ట్రీలో హేమామాలిని, అనుపమ్ ఖేర్, ఒలింపిక్స్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్, కొరియోగ్రాఫర్ రెమె డిసౌజా, విజయ్ దేవరకొండ కూడా పుణ్య స్నానం ఆచరించారు.






