సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి కోమటిరెడ్డి

by Ramesh Goud |

తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సన్నబియ్యం లబ్దిదారుడైన సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం (fine rice)తో భోజనం చేశారు.

సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సన్నబియ్యం లబ్దిదారుడైన సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం (fine rice)తో భోజనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రాష్ట్రంలో ప్రతీ పేదవాడి లబ్ది చేకూరే విధంగా ఉగాది పర్యదినం సందర్భంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారభించింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల (Ration Shops) ద్వారా సన్న బియ్యం (Fine Rice) పంపిణీ (Distribution) జరుగుతోంది.

ఈ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు (Congress Leaders) లబ్దిదారుల ఇళ్లలో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham)తో కలిసి నకిరేకల్ (Nakirekal) నియోజకవర్గం నార్కట్ పల్లి మండలం (Narketpally mandal) ఎల్లారెడ్డి గూడెం (Ellareddy Gudem)లో ఓ లబ్దిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పంపిణీ చేస్తున్న సన్న బియ్యం నాణ్యత గురించి ఆ కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దొడ్డు బువ్వ అనంగనే సగం ఆకలి చచ్చిపోతుందని, తినాలని లేకున్నా కాసిన్ని మెతుకులు నోట్లో కుక్కుకోవాల్సి వచ్చేదని, సగం కడుపుతోనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ప్రతీ పేదొడికి ఉండేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ధనిక, పేద అనే తేడాలేకుండా అందరి కంచాల్లో ఇక సన్నబియ్యమే ఉండేలా.. ఇందిరమ్మ రాజ్యంలో సన్న బియ్యం పంపిణీ పథకంతో సామాజిక విప్లవానికి నాంది పలికామని చెప్పుకొచ్చారు. అలాగే ప్రజా పాలనలో తెలంగాణలోని పేదవాడు కడుపు నింపుకోవటమే కాదు.. సంపన్నులు తినే సన్నబియ్యం తింటున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో సహపంక్తి భోజనం చేయడం ఆనందంగా ఉందని, అన్నం వడ్డించిన సోదరి అరుణ కుటుంబ సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Next Story